చిరంజీవి ‘భోళా శంకర్’ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌

చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌‌‌‌‌‌‌‌లు సినిమాపై అంచనాలు పెంచాయి. శివరాత్రి సందర్భంగా చిరంజీవి కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి ఫెరోషియస్‌‌‌‌గా కనిపిస్తున్నారు. చేతిలో డమరుకం పట్టుకుని డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంది స్టిల్. మరోవైపు ‘జై బోలో భోళా శంకర్’ అంటూ సాగే కోరస్‌‌‌‌, బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోర్‌‌‌‌తో మోషన్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌కి మరింత ఇంటెన్సిటీ తెచ్చాడు మహతీ స్వరసాగర్. తమన్నా హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో షూటింగ్ జరుగుతోంది. ప్రధాన నటీనటులంతా షూటింగ్‌‌‌‌లో పాల్గొంటున్నారు.