
‘గాడ్‌ఫాదర్’తో హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో బాబీ దర్శకత్వం వహిస్తున్న మాస్ మూవీ ఒకటి. ఇది చిరుకి 154వ సినిమా. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
ఈ సినిమా డబ్బింగ్ పనులు నేడు ప్రారంభం అయ్యాయి. దర్శకుడు బాబీ, పలువురు టెక్నీషియన్ల సమక్షంలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేశారు. చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే ఈ చిత్రం నుంచి భారీ అప్ డేట్లు వస్తాయని తెలిపింది. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య, అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో చిరు ఫిషింగ్ యార్డ్ యూనియన్ లీడర్‌గా కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టీజర్ దీపావళి సందర్భంగా విడుదల కానుంది.