కస్టమర్లకు రూ.2 కోట్లు టోకరా పెట్టిన చిట్ ఫండ్ కంపెనీ

కస్టమర్లకు రూ.2 కోట్లు టోకరా పెట్టిన చిట్ ఫండ్ కంపెనీ
  • పరిగిలో చిట్ ఫండ్  కంపెనీ మోసం

పరిగి వెలుగు: వికారాబాద్​ జిల్లా పరిగి పట్టణంలో ఓ చిట్ ఫండ్  కంపెనీ తన కస్టమర్ల నుంచి రూ.2 కోట్లు తీసుకుని బోర్డు తిప్పేసింది. పరిగి పట్టణంలో ఎస్ఎల్ఎన్ కే చిట్​ఫండ్​ సంస్థ కొన్ని సంవత్సరాల పాటు పనిచేసింది. వివిధ కస్టమర్ల నుంచి రూ.2 కోట్ల డిపాజిట్లు సేకరించింది. పరిగి మండలంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు సుమారు వంద మందికిపైగా చిట్ లో చేరారు. బాధితుల్లో ప్రైవేటు ఉద్యోగులు, రైతులు, దినసరి వ్యాపారులు ఉన్నారు. అయితే, కొన్ని నెలలుగా చిట్ ఫండ్  కంపెనీ తన కస్టమర్లకు డబ్బులు తిరిగి చెల్లించడం లేదు. 

ఆఫీసు తెరిచి ఉన్నా సిబ్బంది లేరు. ఆఫీస్ బాయ్, సెక్యూరిటీ మాత్రమే పనిచేస్తున్నారు. ఆఫీసుకు వెళ్లి ఎంక్వయిరీ చేయగా సిబ్బంది ఎవరూ లేరని ఆఫీస్  బాయ్ తెలిపాడని బాధితులు చెప్పారు. దీంతో చిట్ ఫండ్  సంస్థపై బాధితులు సోమవారం పరిగి డీఎస్పికి ఫిర్యాదు చేశారు. సంస్థ యాజమాన్యంపై కేసు నమోదు చేసి తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరారు.