చిత్రపురి కాలనీపై అవినీతి ఆరోపణలు ..వల్లభనేని అనిల్ అరెస్ట్

చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.  చిత్రపురి కాలనీలో ఇండ్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. చిత్రపురి కాలనీలోని ఇండ్లు రెండు సార్లు కేటాయింపులు జరిపినట్లు వల్లభనేని అనిల్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు పలువురు. దీంతో వల్లభనేని అనిల్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు.

చిత్రపురి కాలనీపై వస్తున్న అవినీతి ఆరోపణలను  వారం రోజుల క్రితమే(మే14) ఖండించారు వల్లభనేని  అనిల్ . చిత్రపురి కాలనీ అభివృద్ధికి అడ్డుపడొద్దని సూచించారు చిత్రపురి కాలనీపై ఇప్పటికే 21 కేసులు కోర్టులో ఉన్నాయని.. ఎంతో మంది విచారణ జరిపి అవినీతి జరగలేదని తేల్చారని చెప్పారు.  నిర్మాతలకు సంబంధించిన మూవీ టవర్స్ లోని అవినీతి బయటపడకుండా ుండటానికే చిత్రపురి కాలనీలో అవినీతి జరిగిందంటూ కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.