
ధన్వాడ, వెలుగు : ప్రజా సంక్షేమమే ధ్యేయమని, పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం ధన్వాడ మండల కేంద్రంలోని సీఎన్ఆర్ భవనంలో 82 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్ష ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రూ. 2,945 కోట్ల నిధులను మంజూరు చేశారన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, వైస్ చైర్మన్ హన్మంతు, ఎమ్మెల్యే పీఎం చిట్టెం మాధవరెడ్డి, ఎమ్మార్వో సింధుజా, ఎంపీడీవో సాయి ప్రకాశ్, ఏపీవో వెంకటేశ్వర్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, నరహరి, నిరంజన్ రెడ్డి, నీరటి రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
'పేట' ను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ ధ్యేయం
మరికల్, వెలుగు : బీఆర్ఎస్ పాలనలో సమస్యలు పరిష్కారం కాక నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని 'పేట' ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో 77 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.