
ఏపీ రాష్ట్రం చిత్తూరు సిటీ నడిబొడ్డున ఏం జరుగుతుంది.. కమాండోలు రావటం వెనక కారణాలు ఏంటీ.. దేశ వ్యాప్తంగా ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. చిత్తూరు సిటీలోని గాంధీరోడ్డులోని ఓ షాపులోకి ఆరుగురు వ్యక్తులు తుపాకులతో వచ్చారు. గాంధీరోడ్డులోని IDBI బ్యాంక్ ఎదుట వ్యాన్ పార్క్ చేసిన దుండగులు.. ఆ వెంటనే ఎదురుగా ఉన్న షాపులోకి చొరబడ్డారు. షాపు ఉన్న కాంప్లెక్స్ లోనే బ్యాంక్ కూడా ఉంది. తుపాకులతో వచ్చిన ఆరుగురు దుండగులు.. బ్యాంక్ దోపిడీకి వచ్చారా లేక షాపులో చోరీకి వచ్చారా అనేది మాత్రం క్లారిటీ రాలేదు.
విషయం తెలిసిన వెంటనే లోకల్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దుండగులు వచ్చిన వ్యాన్ లో తుపాకులు ఉండటం, ఆరుగురు వ్యక్తుల దగ్గర తుపాకులతోపాటు మారణాయుధాలు ఉండటంతో.. పై అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారులు కమాండో ఆపరేషన్ చేపట్టారు. ఆక్టోపస్ టీం ఎంట్రీ ఇచ్చింది. ఆక్టోపస్ కమాండోలతోపాటు లోకల్ పోలీసులు, క్రైం బ్రాంచ్ పోలీసులు తుపాకులతో చిత్తూరులో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
బ్యాంక్ దోపిడీ కోసం వచ్చారనే అనుమానాలు లేకపోలేదు. బ్యాంక్ దోపిడీతో వచ్చినోళ్ల దగ్గర ఉన్న తుపాకులు ఎలా ఉన్నాయి.. ఆ తుపాకులు వాళ్లకు ఎక్కడికి నుంచి వచ్చాయి అనేది ఇప్పుడు కీలక అంశంగా మారింది. ఆక్టోపస్ కమాండోల ఎంట్రీతో.. ఇప్పటికే నలుగురు దుండగులను బంధించినట్లు చెబుతున్నారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకునేందుకు ఆక్టోపస్ ఆపరేషన్ చేస్తోంది.
తుపాకులతో వచ్చిన దుండగులు కాల్పులు జరిపితే.. ఆక్టోపస్ టీం కూడా కాల్పులు జరపాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే చుట్టుపక్కల అందర్నీ ఖాళీ చేయించి.. ఆపరేషన్ చేస్తున్నారు పోలీసులు.