ఎంపీఎల్ ఐరన్ కంపెనీపై పోరాటం.. చిట్యాలలో ఉద్రిక్తత

 ఐరన్ కంపెనీ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపొద్దంటూ గ్రామస్తులు ధర్నా చేశారు. దీంతో చిట్యాల మండలం వెలిమినేడు ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ విస్తరణ కోసం శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ జరపొద్దు అంటూ ప్రజాఅభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటుచేసిన టెంట్లను గ్రామస్తులు తొలగించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. 

ఇరువురి మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఈ క్రమంలో గ్రామస్తులపై పోలీసులు స్వల్ప లాఠీ  చార్జ్  చేశారు. కంపెనీ గేట్ ముుందు గ్రామస్తులు బైఠాయించి ధర్నాకు దిగారు.