వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేసే అతి కొద్ది మంది హీరోల్లో కమల్ హాసన్ తర్వాత చియాన్ విక్రమ్ (ChiyaanVikram) పేరు గుర్తుకు వస్తుంది. ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ ఉంటారు. ఆయన ఎంచుకునే సినిమాలతో పాటు..అందుకు తగ్గట్లు తన లుక్స్‌ను మార్చుకుంటూ ఉంటారు.సినిమా హిట్ అయినా..ఫ్లాప్ అయినా విక్రమ్ రేంజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలో తన లుక్ కోసమే ఎక్కువ కసరత్తు చేస్తుంటాడు.తన పాత్రకు జీవం పోయడానికి ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు.
ప్రస్తుతం ఎస్.యు.అరుణ్‌కుమార్(S.U. Arun Kumar) డైరెక్షన్ లో విక్రమ్ ఓ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన (Chiyaan62) అనౌన్స్ మెంట్ వీడియోను మేకర్స్ గతేడాది రిలీజ్ చేశారు.ఇందులో పోలీస్‌స్టేషన్‌లోకి వచ్చి మరీ..ఇద్దరు వ్యక్తుల్ని కొడుతూ విక్రమ్ కనిపించారు.తానెవరో కానిస్టేబుల్ చెవిలో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ మూవీకి ‘వీర ధీర శూరన్’(Veera Dheera Sooran) అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా..త్వరలో తెలుగు టైటిల్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.ఈ సినిమాలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ఎస్.జె.సూర్య, దుసరా విజయన్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.
టీజర్ గమనిస్తే..ఈ సినిమాలో హీరో పేరు కాళి,అతనికి ఓ కిరాణా షాప్ ఉంటుంది. అందులో తన పని తాను చేసుకుంటుంటాడు. అతనితో అంతకు ముందే దెబ్బలు తిన్న విలన్స్ జీపులు, వ్యాన్స్ వేసుకుని అక్కడికి చేరుకుంటారు.ఇందులో విక్రమ్ ఆటిట్యూడ్, స్వాగ్ అదిరిపోయాయి. తమను కొట్టింది కిరాణా షాప్‌లో ఉన్నోడే అని కన్‌ఫర్మ్ అయితే అతన్ని చంపేయాలనేది డిసైడ్ అవుతారు.
అయితే విలన్స్ జాడను హీరో ముందే పసిగట్టేస్తాడు. అక్కడ పని చేసుకుంటూనే విలన్స్‌ను ఏం చేయాలా అని ఆలోచిస్తు అప్పటి వరకు దాచి పెట్టిన తుపాకీ తీసుకుని ఓ విలన్ చెవికి గాయమయ్యేటట్లు కాల్చడంలో దుండగులు భయంతో పరుగులు తీస్తారు. షాప్‌లో ఉన్న కస్టమర్ హీరో చేతిలోని గన్ చూసి భయపడుతుంది.
కానీ హీరో అదేమీ పట్టించుకోకుండా ఆమె కొన్న సరుకుల ఖర్చు ఎంతయ్యిందనే విషయాన్ని చెప్పటంతో షాపులోని లేడీ కస్టమర్, ఓ పక్క భయం, మరో పక్క ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టేస్తుంది. 3:45 మినిట్స్ ఉన్న ఈ టైటిల్ టీజర్ చాలా పవర్ ఫుల్ ఇంపాక్ట్ తీసుకొచ్చింది.
విక్రమ్ 62 మూవీ ఏదో బలమైన కథాంశంతో సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో వీడియో అదిరిపోయింది. ఈ మూవీకి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
అలాగే విక్రమ్ పా. రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ (Thangalaan) అనే సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. విక్రమ్ కు ఇది 61వ మూవీ. స్టూడియో గ్రీన్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ (MalavikaMohanan)గా కనిపించనుంది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.