Thangalaan OTT : ఓటీటీలోకి విక్రమ్ లేటెస్ట్ హిట్ తంగలాన్‌..స్ట్రీమింగ్ డేట్ ఇదే

Thangalaan OTT : ఓటీటీలోకి విక్రమ్ లేటెస్ట్ హిట్ తంగలాన్‌..స్ట్రీమింగ్ డేట్ ఇదే

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు పా.రంజిత్‌ (Pa Ranjith) దర్శకత్వంలో తెరకెక్కిన తంగలాన్‌ (Thangalaan) సినిమా ఆగస్టు 15న రిలీజైంది.ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో విక్రమ్ మరోసారి విభిన్నంగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం కథాపరంగాను, కమర్షియల్‍గానూ పర్వాలేదనిపించింది.అయితే, తంగలాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం. 

Also Read :- నమ్మిన సిద్ధాంతంకోసం.. 

తంగలాన్‌ ఓటీటీ:

ప్రస్తుతం కొన్ని చోట్ల థియేటర్లలో రన్ అవుతున్న ఈ మూవీ 25 రోజులు కంప్లైంట్ చేసుకుంది. మరోవైపు ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది.ఈ సెప్టెంబరు 20న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్‍కు ముందే నెట్ ఫ్లిక్స్ ఈ డీల్ చేసుకుంది. అయితే, నెట్‍ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.మరో రెండ్రోజుల్లో స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశమా ఉంది. ప్రస్తుతానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 20న స్ట్రీమింగ్ కానుందని.. హిందీ వెర్షన్ మాత్రం సెప్టెంబర్ 27న రానుందని సమాచారం. 

తంగలాన్  కలెక్షన్లు:

ఇప్పటి వరకు తంగలాన్ చిత్రం వరల్డ్ వైడ్ గాదాదాపు రూ.105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీ ఫుల్ రన్‍లో రూ.110కోట్లను దాటే అవకాశం ఉందనే ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కెలెక్షన్స్ బట్టి చూస్తే యావరేజ్ హిట్ గా నిలిచింది తంగలాన్.

  • Beta
Beta feature