వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేసే అతి కొద్ది మంది హీరోల్లో కమల్ హాసన్ తర్వాత చియాన్ విక్రమ్ (ChiyaanVikram) పేరు గుర్తుకు వస్తుంది. ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ ఉంటారు. ఆయన ఎంచుకునే సినిమాలతో పాటు..అందుకు తగ్గట్లు తన లుక్స్‌ను మార్చుకుంటూ ఉంటారు. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా విక్రమ్ రేంజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలో తన లుక్ కోసమే ఎక్కువ కసరత్తు చేస్తుంటాడు. తన పాత్రకు జీవం పోయడానికి ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు.
ప్రస్తుతం ఎస్.యు.అరుణ్‌కుమార్(S.U. Arun Kumar) డైరెక్షన్ లో విక్రమ్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన (Chiyaan62) అనౌన్స్ మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పోలీస్‌స్టేషన్‌లోకి వచ్చి మరీ..ఇద్దరు వ్యక్తుల్ని కొడుతూ విక్రమ్ కనిపించారు. తానెవరో కానిస్టేబుల్ చెవిలో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇందులో విక్రమ్ ఆటిట్యూడ్, స్వాగ్ అదిరిపోయాయి. విక్రమ్ 62 మూవీ ఏదో బలమైన కథాంశంతో సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. చివరిగా సరకులు మోసుకుంటూ ద్విచక్రవాహనం వెళ్తూ విక్రమ్ కనిపించగా ఆడియాన్స్ లో ఆసక్తి కలిగించారు. జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో వీడియో అదిరిపోయింది.
అలాగే విక్రమ్ పా. రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ (Thangalaan) అనే సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. విక్రమ్ కు ఇది 61వ మూవీ. స్టూడియో గ్రీన్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ (MalavikaMohanan)గా కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది 2024 జనవరి 26 న రిలీజ్ కాబోతుంది.
ALSO READ : రాశీ ఖన్నానా లేక ఆమె చెల్లెలా!.. ఫొటోస్ వైరల్