చియాన్ 63 షురూ..సరికొత్త అవతార్‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతున్న విక్రమ్

చియాన్ 63 షురూ..సరికొత్త అవతార్‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతున్న విక్రమ్

డిఫరెంట్ స్ర్కిప్ట్‌‌‌‌లను సెలెక్ట్ చేసుకోవడంతో పాటు క్యారెక్టరైజేషన్‌‌‌‌లోనూ కొత్తదనం చూపించాలని తపన పడతాడు విక్రమ్. తాజాగా ఆయన 63వ చిత్రాన్ని ప్రకటించారు. మండేలా, మావీరన్ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపును అందుకున్న మడోన్ అశ్విన్‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌లో ఈ సినిమా ఉండబోతోంది. శాంతి టాకీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు.  ‘చియాన్ 63’ వర్కింగ్ టైటిల్‌‌‌‌తో రూపొందించనున్న ఈ చిత్రంలో విక్రమ్ సరికొత్త అవతార్‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నారని మేకర్స్ తెలియజేశారు.

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న  ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని దర్శక నిర్మాతలు చెప్పారు. మరోవైపు విక్రమ్ ప్రస్తుతం ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో  ‘వీర ధీర శూరన్‌‌‌‌’ చిత్రంలో నటిస్తున్నాడు.  రియా శిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.