
కొడంగల్, వెలుగు: కొడంగల్‌లో 20 కిలోల క్లోరోహైడ్రేట్ పట్టుబడింది. పక్కా సమాచారంతో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌గౌడ్, కర్నాటకకు చెందిన మేగనాథ్ గౌడ్, ఉష్ణయ్య గౌడ్ ఓ కారులో తప్పించుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని పట్టుకున్నారు. కారులో 20 కిలోల క్లోరోహైడ్రేట్ లభ్యం కావడంతో నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కల్తీ కల్లు తయారీకి క్లోరోహైడ్రేట్ వాడుతున్నట్లు పేర్కొన్నారు.