డైలీ లైఫ్‌లో హెల్త్ పైన కేర్ తీసుకోక, మంచి తిండి తినకపోవడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది. ఎల్‌డిఎల్ అంటే (లో డెన్సిటీ లైపోప్రోటీన్) ఇది చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డిఎల్(హై డెన్సిటీ లైపోప్రోటీన్) అంటారు. హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ లివర్ దగ్గర కొలెస్ట్రాల్‌ను ఫ్యూరిఫై చేస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండూ ఉంటాయి.
హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ శరీరంలో 60 మిల్లీగ్రాములు/ డెసీలీటర్ కంటే తగ్గొద్దు. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ 130 మి.గ్రా/డెసీలీటర్ కంటే పెరగొద్దు. ఇవి ఎప్పుడూ బ్యాలెన్సింగ్‌గా ఉండాలి. హై కొలెస్ట్రాల్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీని వల్ల దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే హార్ట్‌ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్, పెరాలసిస్ లాంటి వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా హైబ్లడ్ ప్రెజర్, డయాబెటిస్ కూడా వస్తాయి. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకుంటే కొలెస్ట్రాల్ ఉందని గుర్తించొచ్చు.
కొలెస్ట్రాల్ రక్తంలో వ్యాక్స్ లాగా ఉంటుంది. కొలెస్ట్రాల్ హెల్దీ శరీరానికి కావాల్సిన కణాలను నిర్మిస్తుంది. కానీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే అది రక్తనాళాల్లో కలిసి, రక్తంలో ఉండే ఆక్సిజన్, న్యూట్రియెంట్స్‌ను శరీరంలోని అవయవాలకు చేరకుండా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ వల్ల రక్తం గడ్డకట్టి హార్ట్‌ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. హై కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఫ్యాటీ యాసిడ్స్ తినడం వల్ల వస్తుంది. కొంత మందికి ఇది వారసత్వంగా కూడా వస్తుందట.
కొలెస్ట్రాల్ ఉందని తెలిసినప్పటినుండి దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. డాక్టర్ సలహాతో మందులు వాడుతూ మంచి డైట్ ఫాలో అయితే 3 నుండి 6 నెలల్లో తిరిగి నార్మల్ అవ్వచ్చు. కానీ మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లలో కొలెస్ట్రాల్ తగ్గడానికి కొంచెం టైం పడుతుంది.
చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మూసుకుపోయిన నాళాలను తెరవడానికి హెల్ప్ అవుతుంది. గుండెలోని రక్తం బాగా పంప్ అవుతుంది. చన్నీటిని స్నానం చేస్తే శరీరంలో కొవ్వు పెరగదు. అలాగే బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్ అంతా లివర్ లోనే తయారవుతుంది. హై కొలెస్ట్రాల్ అనేది బయట తినే జంక్ ఫుడ్ వల్లే తయారవుతుంది. అందుకే హెల్ధీఫుడ్ తింటే కొలెస్ట్రాల్ సమస్య రాదు.