రాజీనామా చేయాలంటూ చొప్పదండి ఎమ్మెల్యేకు ఫోన్ కాల్

రాజీనామా చేస్తే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటూ ఈ మధ్య సామాన్య పౌరులు ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్ చేయడం ఈ మధ్య పరిపాటిగా మారింది. తాజాగా చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే  సుంకె రవిశంకర్ కి కూడా రాజీనామా చేయాలంటూ ఓ యువకుడి నుంచి  ఫోన్ కాల్ వచ్చింది. గంగాధర మండలం  కాసారం గ్రామానికి చెందిన  పూరెళ్ళ మహేందర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కి ఫోన్ చేసి రాజీనామా చేయాలని కోరాడు. 

తమ‌  గ్రామానికి రోడ్డు వేయిస్తానని రెండు మూడు సార్లు  చెప్పి వేయలేదని, మీరు రాజీనామా చేస్తేనైనా రోడ్డు వస్తుందంటూ ఎమ్మెల్యేను కోరాడు. అయితే  మంచిదంటూ ఎమ్మెల్యే  సుంకె రవిశంకర్ ఆ యువకుడికి సమాధానం ఇచ్చి ఫోన్ కట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.