- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర, వెలుగు: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురానగర్, నారాయణపూర్, మంగపేట గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు సెంటర్‌ను మంగళవారం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వడ్లకు మద్దతు ధరను పొందాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాలాగౌడ్, ఏఎంసీ చైర్మన్ జాగిరపు రజిత-, వైస్ చైర్మన్ తోట కరుణాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుమళ్ల మనోహర్, లీడర్లు భాస్కర్, చందు పాల్గొన్నారు.
మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మల్యాల, తాటిపల్లి, బల్వoతాపూర్, ముత్యంపేట, మల్యాల క్రాస్ రోడ్డు, రామన్నపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. కార్యక్రమంలో తహీల్దార్ మునీoదర్, ఎంపీడీవో స్వాతి, ఏఎంసీ చైర్మన్ మల్లీశ్వరి, ఆనంద రెడ్డి, ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జీవన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాంలింగారెడ్డి, లక్ష్మణ్, శంకర్ గౌడ్, సతీశ్‌రెడ్డి, అనిల్, హరినాథ్
పాల్గొన్నారు..
రామడుగు, వెలుగు : రామడుగు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 62 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగళవారం చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రామడుగు, చిప్పకుర్తి, వెలిచాల తదితర గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.