20 హైస్కూళ్లలో స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్నాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

20 హైస్కూళ్లలో స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్నాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెల్లడి

గంగాధర, వెలుగు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాలనలో తన మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపిస్తున్నారు. తాజాగా గంగాధర మండలం గర్శకుర్తి హైస్కూల్​లో జరిగిన కార్యక్రమంలో మరో కొత్త ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శ్రీకారం చుట్టారు. 200 మంది విద్యార్థులకు పైగా ఉన్న హైస్కూళ్లలో తన సొంత ఖర్చుతో ఉదయం టిఫిన్​, సాయంత్రం స్నాక్స్​ అందజేస్తానని ప్రకటించారు. పైలట్ ప్రాజెక్ట్​గా గర్శకుర్తి స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా 200 మందికి పైగా విద్యార్థులు ఉన్న స్కూళ్లు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో 20కి పైగా ఉన్నాయి. 

మరోవైపు పార్టీలోనూ కష్టపడి పనిచేసే కార్యకర్తలు, లీడర్లు పదవులు ఇస్తానని చెప్పి నామినేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులను కేటాయించారు. దీంతోపాటు తన బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేలకు శాలువాలు, బొకేలు కాకుండా స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యార్థులకు నోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెన్నులు గిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే రూ.10 లక్షలలోపు నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేయకూడదని నిర్ణయించుకున్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

కొడిమ్యాల/బోయినిపల్లి, వెలుగు: చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గురువారం కొడిమ్యాల మండల కేంద్రంలో లో 45 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం తిర్మలాపూర్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామ అధ్యక్షుడు లింగారెడ్డి ఇటీవల చనిపోగా.. 

బాధిత కుటుంబానికి రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. పిల్లల చదువుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్​ బీసీ సెల్​ జిల్లా అధ్యక్షుడు రవీందర్, మండల అధ్యక్షుడు రమణారెడ్డి, కొడిమ్యాల ప్యాక్స్ చైర్మన్​రాజనర్సింగ రావు, బ్లాక్​ కాంగ్రెస్​ అద్యక్షుడు మహేశ్వర్​రెడ్డి, ఏఎంసీ చైర్మన్​ ఎల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వినోద్​రెడ్డి, సుధాకర్​, వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి  పాల్గొన్నారు.