గంగాధర, వెలుగు : కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణను చీకటి చేస్తారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. శుక్రవారం గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని, ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. పార్టీలకతీతంగా తాను సంక్షేమ పథకాలను అందజేశానన్నారు. కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని, బీజేపీకి ఓటేస్తే రాష్ట్రాన్ని పెట్టుబడిదారుల చేతిలో పెడతారని ఆరోపించారు.
కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామ్మధుకర్, వైస్‌ఎంపీపీ రాజగోపాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తిర్మల్‌రావు, లీడర్లు నర్సయ్య. గంగన్న, నవీన్‌రావు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సతీమణి ప్రచారం గంగాధర, బూరుగుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సతీమణి దీవెన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలోని బీడీల ఫ్యాక్టరీ, బూరుగుపల్లిలో ఇంటింటికీ తిరుగుతూ రవిశంకర్‌కు ఓటేయాలని కోరారు.