గంగాధర, వెలుగు: సబ్బండ వర్గాల సంక్షేమానికి చిరునామా సీఎం కేసీఆర్ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బూరుగుపల్లిలోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సోమవారం ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక బిడ్డనైన తనను చొప్పదండి ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
తాను నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని, స్థానికేతరులు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేరన్నారు. ఎన్నికల ముందు వచ్చి ఆ తర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈ ప్రాంతం మీద మమకారం ఉండదన్నారు. కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందన్నారు.