చొప్పదండి, వెలుగు: చొప్పదండి మున్సిపల్‌చైర్‌పర్సన్ గుర్రం నీరజ, భూమారెడ్డి దంపతులు, ఇతర బీఆర్ఎస్ లీడర్లు గురువారం ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మున్సిపల్ చైర్మన్ దంపతులతో పాటు రైతు సమన్వయ సమితి చొప్పదండి పట్టణ అధ్యక్షుడు గుర్రం హనుమంతరెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ ముద్దం మల్లేశం, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పిట్టల వెంకటేశం, టీడీపీ మాజీ మండలాధ్యక్షుడు హనుమంతరెడ్డి, లీడర్లు శేఖర్, మధుసూదన్‌తో పాటు పలువురికి జీవన్‌రెడ్డి తన ఆఫీసులో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడడం ఖాయమన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కిసాన్సెల్అధ్యక్షుడు పురం రాజేశం, లీడర్లు పుల్కం నర్సయ్య, బండపల్లి యాదగిరి, వీర్ల నర్సింగరావు పాల్గొన్నారు.