డ్రైవర్ లేకుండానే ఆటో చక్కర్లు..

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.  బైక్ ను ఆటో ఢీకొనగానే.. అందులో నుంచి డ్రైవర్ కిందపడ్డాడు. అనంతరం డ్రైవర్ లేకుండానే రోడ్డుపై ఆటో చక్కర్లు కొట్టింది.

హ్యాండిల్ ఒకవైపునకు పూర్తిగా బెండ్ అయిన కారణంగా ఇలా జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.