స్టాఫ్ నర్సులను విధుల్లోకి తీసుకోవాలి : చొప్పరి రవికుమార్

స్టాఫ్ నర్సులను విధుల్లోకి తీసుకోవాలి : చొప్పరి రవికుమార్

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట గవర్నమెంట్​హాస్పిటల్​ ​నుంచి తొలగించిన స్టాఫ్​ నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ డిమాండ్​చేశారు. శుక్రవారం స్టాఫ్ నర్సులతో కలిసి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కష్టకాలంలో విధులు నిర్వహించి సేవలందించిన వారిని గుర్తించకుండా ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తుందన్నారు. 

వెంటనే రోడ్డున పడ్డ స్టాఫ్​ నర్సులను ఆదుకుని వారికి న్యాయం చేయాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో రవి, స్టాప్ నర్సులు తార, గీత, బాల్ లక్ష్మి, అనిత, సౌందర్య, అరుణ, లావణ్య, రాజకుమార్, బాలు పాల్గొన్నారు.