రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమవుతోంది. ఢిల్లీలోని రాజ్ పథ్ పై హెలికాప్టర్లతో రిహార్సల్స్ నిర్వహించారు. రాష్ట్రపతి భవన్ మీదుగా నాలుగు మిగ్ 17 ఛాపర్లు ఎగురుతూ కనిపించాయి. జాతీయ పతాకాన్ని గగన తలంలో ఎగురు వేస్తూ.. ఛాపర్లు తిరిగాడాయి. మరో మూడు రోజుల్లో భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. దీంతో ఈ ఏడాది వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమంది. ఈ మేరకు ఢిల్లీలోని రాజ్ పథ్ లో రీ పబ్లిక్ డే రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. వీటిని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.
మరోవైపు భారత సైన్యం కూడా పరేడ్ కోసం రెడీ అవుతుంది. ఫుల్ డ్రెస్ కోడ్ తో ట్రెడిషనల్ మార్చ్ కోసం ఆర్మీ కూడా రిహార్సల్స్ నిర్వహిస్తోంది. భారత్ లో తొలిసారిగా దివంగత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈ ఏడాది జనవరి 24కి బదులుగా జనవరి 23 నుండి ప్రారంభించింది మోదీ సర్కార్.
#WATCH | Republic day full-dress rehearsal underway at Rajpath, Delhi. pic.twitter.com/DooaOcXAft
— ANI (@ANI) January 23, 2022
ఇవి కూడా చదవండి: