స్టార్ హీరోల చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అలరించే నోరా ఫతేహి.. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న ‘మట్కా’లో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
‘లే లే రాజా.. లేత లేత రోజా.. బోలో బోలో ఆజా అందాల దర్వాజా’ అంటూ సాగిన పాట రెట్రో స్టైల్‌లో ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేయగా, భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాశారు. నీతి మోహన్ పాడింది. కలర్‌ఫుల్ పబ్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన పాటలో నోరా ఫతేహి రెట్రో లుక్‌లో అలరించింది. ఎక్స్‌ట్రార్డినరీ డ్యాన్స్ మూవ్స్‌తో మెస్మరైజ్ చేసింది. జానీ చేసిన కొరియోగ్రఫీ వింటేజ్ వైబ్స్‌ని తీసుకొచ్చింది. ఈ పాటలో వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్‌లో ఆకట్టుకున్నాడు.
పలాస’ ఫేమ్ కరుణ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నవంబర్ 14న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.