వాళ్ళ కేరింతలే మన సంతోషం: ఫ్యామిలీతో కొరియోగ్రాఫర్ జానీ దీపావళి సెలబ్రేషన్స్

వాళ్ళ కేరింతలే మన సంతోషం: ఫ్యామిలీతో కొరియోగ్రాఫర్ జానీ దీపావళి సెలబ్రేషన్స్

కొరియోగ్రాఫర్ జానీ తన కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకున్న ఫొటోస్ షేర్ చేశారు. "వాళ్ళ కేరింతలే మన సంతోషం.. ఈ పండుగ నాడు మీరు వెలిగించే ప్రతి బాణాసంచాలాంటి చిరునవ్వులు, మిఠాయిల్లాంటి మధురమైన క్షణాలు మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దీపావళి" అంటూ ఆయన అభిమానులకు విషెష్ తెలిపారు.

ఈ ఫొటోస్లో జానీ తన ఫ్యామిలీతో చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు. వారితోనే తన నిజమైన సంతోషం అంటూ పోస్ట్ చేసిన ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్నాయి. 

ఇకపోతే.. ఈ మధ్యే జైలు నుంచి రిలీజైన కొరియోగ్రాఫర్ జానీ.. బయట ఎక్కువగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యులతో నెల్లూరుకు వెళ్లి.. అక్కడే దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : ‘క’ మూవీ సక్సెస్ ఎంతో సంతృప్తినిచ్చింది