హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన యువతి తన ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెల్లడించింది. 2017లో ‘ఢీ’ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు బాధిత యువతి పేర్కొంది. ఓ షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్లానని, ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది.
అదే విధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్ లో యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇటీవల సూపర్ హిట్ సాంగ్స్గా యూట్యూబ్లో ట్రెండ్ సృష్టించిన పలు సాంగ్స్కు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేశాడు. ‘అల వైకుంఠపురం’ సినిమాలోని ‘బుట్ట బొమ్మ’ సాంగ్ జానీ మాస్టర్కు ఓవర్ నైట్ స్టార్డమ్ తీసుకొచ్చింది.. పుష్ప సినిమాలోని శ్రీవల్లీ సాంగ్, బీస్ట్ సినిమాలోని ‘అరబిక్ కుత్తు’ సాంగ్స్ ఏ రేంజ్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాంచరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు జానీ మాస్టర్ ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఇంత ప్రతిష్టాత్మక సినిమాకు పనిచేస్తుండగా జానీ మాస్టర్పై ఇలాంటి ఆరోపణలు రావడంతో మూవీ లవర్స్ అవాక్కయ్యారు. జానీ మాస్టర్ గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా డిస్కషన్ నడుస్తుంది.