కొడుకుపై బెంగ.. జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు

కొడుకుపై బెంగ.. జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు

టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్టర్ త‌ల్లి బీబీ ఖాన్ గుండెపోటుకు గుర‌య్యారు. లైంగిక వేధింపుల కేసులో కొడుకు(జానీ మాస్టర్) జైలుకు వెళ్లడంతో ఆమె గత కొద్దిరోజులుగా దిగులుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు శనివారం గుండెపోటు వచ్చింది. హుటాహుటిన కుటుంబ స‌భ్యులు ఆమెను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి త‌ర‌లించారు. వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

శ్రష్టి వర్మపై పోలీసులకు ఫిర్యాదు

కాగా, జానీ మాస్టర్‌ కేసులో బాధితురాలిగా ఉన్న యువతిపై ఓ యువ‌కుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన శ్రష్టి వర్మ తనను లైంగికంగా వేధించిందంటూ జానీ మాస్టర్‌ అల్లుడు షమీర్‌ నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మామతో కలిసి షూటింగ్‌లకు వెళ్లినప్పుడు శ్రష్టి వర్మ లాడ్జిలో తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. నగ్నంగా ఫొటోలు తీసి బెదిరించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు విచార‌ణ చేపట్టారు.