
కొరియోగ్రాఫర్ జానీ కేసు న్యూస్ మరోసారి తెరపైకి వచ్చింది. ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేస్తూ జానీ వేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టివేసిందని నటి, యాంకర్ ఝాన్సీ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. 'జానీ వేసిన మధ్యంత పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. లైంగిక ఆరోపణల కేసులో జానీపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ గెలిచింది' అంటూ అందులో పేర్కొంది. దీంతో జానీ గురించి సోషల్ మీడియా అంత మరోసారి హాట్ టాపిక్గా నిలిచింది. లేటెస్ట్గా ఝాన్సీ ట్వీట్‌పై జానీ X వేదికగా రియాక్ట్ అయ్యాడు.
ఆయన మాటల్లోనే.. "తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి, నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు.
Also Read :- లపతా లేడీస్కు మరో అరుదైన ఘనత
మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున.. మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. చివరకు న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది!!" అని కొరియోగ్రాఫర్ జానీ పోస్టులో వెల్లడించారు.
తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది.
— Jani Master (@AlwaysJani) January 29, 2025
ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు…
ఝాన్సీ పోస్ట్‌లో ఏముంది?
ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేస్తూ కొరియోగ్రాఫర్ జానీ కేసు వేశారు. లైంగిక ఆరోపణల కేసులో జానీపై ఫిల్మ్ ఛాంబర్ గెలిచిందని ఝాన్సీ తాజా పోస్ట్ లో పేర్కొంది. అలాగే జానీ భాషా పిటీషన్‌ను కోర్టు కొట్టివేసిందని.. పని చేసే చోట మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు చాలా ముఖ్యమైనదని.. ధర్మం వైపు నిలబడి న్యాయపోరాటం చేసేందుకు సహకారం అందించిన.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు కృతజ్ఞతలు అంటూ ఝాన్సీ తెలిపింది.