జైలు నుంచి ఇంటికెళ్లిన జానీకి ఎదురైన అనుభవం ఇది.. వీడియో..

జైలు నుంచి ఇంటికెళ్లిన జానీకి ఎదురైన అనుభవం ఇది.. వీడియో..

లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా అరెస్ట్ అయి 37 రోజుల తర్వాత బెయిల్పై ఇంటికొచ్చిన కొరియోగ్రాఫర్ జానీ ‘ఎక్స్’ ఖాతాలో తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశాడు. జైలు నుంచి బయటికి రాగానే నేరుగా ఇంటికెళ్లిన జానీ తన కుటుంబంతో గడిపిన క్షణాలను తన అభిమానులతో పంచుకున్నాడు.

ఈ వీడియోలో కొరియోగ్రాఫర్ జానీ ఇంటికి వెళ్లి తలుపు తెరవగానే తన పిల్లలని చూసి ఎమోషనల్ అయ్యాడు. జానీ కూతురు తన తండ్రిని ఇన్ని రోజులుగా ఎంతగా మిస్ అయ్యిందో డ్రాయింగ్ గీసి చూపించింది. అలాగే భార్య ఆయేషాని హత్తుకుని కంట తడి పెట్టుకున్నాడు కొరియోగ్రాఫర్ జానీ. ‘యానిమల్’ సినిమాలోని ‘నాన్న నువు నా ప్రాణం’ అనే సాంగ్ బ్యాగ్రౌండ్లో ప్లే అవుతూ వీడియో ఎమోషనల్గా ఉంది.

ఇన్ని రోజులు నాకోసం నా కుటుంబం, శ్రేయోభిలాషులు చేసిన ప్రార్థనలే నన్ను ఈరోజు మళ్ళీ వాళ్ల దగ్గరికి చేర్చాయి. సత్యానికి కూడా సూర్యుడిలాగా అప్పుడప్పుడూ గ్రహణం పడుతుంది. కానీ దాని ప్రభావం ఎక్కువ రోజులు ఉండదు. గ్రహణం తర్వాత మళ్ళీ ప్రకాశిస్తుంది. ఈ కష్ట సమయంలో నా కుటుంబం గడిపిన పరిస్థితులు ఎప్పటికీ నా గుండెను గుచ్చేస్తుంటాయి’’ అని జానీ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టాడు.

ALSO READ | ఆ స్టార్ హీరో సినిమా కోసం కిరణ్ అబ్బవరం సినిమా రిలీజ్ ఆగిపోయిందా..?

జానీపై తనకి అసిస్టెంట్‌గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదుతో సెప్టెంబర్ 16 వ తేదీన నార్సింగి పోలీసులు జానీని అరెస్ట్ చేశారు. జానీ అరెస్ట్తో అతని గురించి అటు టాలీవుడ్లో, ఇటు సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చించుకున్నారు. జానీ తప్పు చేసి ఉంటాడని కొందరు, నిజం నిలకడ మీద తెలుస్తుందని.. జానీ తప్పు చేసే మనిషి కాదని ఇంకొందరు తమతమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు.