రాకేష్ మాస్టర్ ఎలా చనిపోయారు? ఏం జరిగింది?

రాకేష్ మాస్టర్ ఎలా చనిపోయారు? ఏం జరిగింది?

రాకేష్ మాస్టర్ మరణ వార్తతో ఇండస్ట్రీలో విషాధచాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంచో.. చెడో.. మనందరి మధ్య ఉన్న ఓ వ్యక్తి దూరమవ్వడం చాలా భాధాకర విషయమని చెప్తున్నారు. 

ఎలా చనిపోయారు? ఏం జరిగింది?

రాకేష్ మాస్టర్ వారం రోజుల క్రితం విశాఖపట్నంలో ఔట్‌డోర్ షూటింగ్‌‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన వడదెబ్బ బారిన పడినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

అతిగా మద్యం సేవించారా? 

వైజాగ్ షూటింగ్‌‌లో రాకేష్ మాస్టర్ అతిగా మద్యం సేవించినట్లు వార్తలొస్తున్నాయి. కామెడీ సీన్స్ షూటింగ్ సందర్భంగా రెండు రోజుల పాటు 20 ఫుల్ బొటల్స్ తాగినట్లు చెప్తున్నారు. అదే రక్త విరోచనాలకు దారి తీసిండొచ్చని అనుమానిస్తున్నారు. 

కాగా, రాకేష్ మాస్టర్మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి నుండి బోరబండకు తరలించారు. రేపు అంత్యక్రియలు జరగొచ్చని తెలుస్తోంది.

ALSO READ: రాకేష్ మాస్టర్ సినిమా ఇండస్ట్రీ ప్రస్థానం