పుష్ప జాతర పాట నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో మైల్ స్టోన్‌‌‌‌ : విజయ్ పొలాకి మాస్టర్

పుష్ప జాతర పాట నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో మైల్ స్టోన్‌‌‌‌ :  విజయ్ పొలాకి మాస్టర్

‘పుష్ప 2’ టైటిల్ సాంగ్, జాతర పాటకి వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ కొరియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని విజయ్ పొలాకి మాస్టర్ అన్నాడు.  రీసెంట్‌‌‌‌గా తను కొరియోగ్రఫీ చేసిన పాటలు టాప్ ట్రెండింగ్‌‌‌‌లో నిలిచిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కొబ్బరిమట్ట’తో డ్యాన్స్ మాస్టర్‌‌‌‌‌‌‌‌గా ఎంట్రీ ఇచ్చి  పలు సూపర్ హిట్ సాంగ్స్‌‌‌‌కి వర్క్ చేశాను.   నా ప్రొఫైల్  సుకుమార్ గారు, బన్నీ గారి దగ్గరికి వెళ్ళింది. నా డెమోస్ చూసి ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌‌‌‌లో చాన్స్ ఇచ్చారు.  అందులో ‘ఊ అంటావా మామ’  సాంగ్‌‌‌‌ని  కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చారు. అక్కడ నుంచి వెనక్కి తిరిగిచూసుకోలేదు. 

తర్వాత ‘పుష్ప2’ కోసం సుకుమార్ గారి నుంచి కాల్ వచ్చింది. ముందుగా జాతర సాంగ్ వినిపించారు. మొదట ఒక బిట్ సాంగ్‌‌‌‌లా చేద్దామని అనుకున్నారు. నేను ఫుల్ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన తర్వాత  ‘అదిరిపోయింది మాస్టర్ ఇలానే వెళ్దాం’ అన్నారు. ఆ సాంగ్ నచ్చిన తర్వాత ‘పుష్ప పుష్ప’  టైటిల్ సాంగ్ కూడా  అవకాశం ఇచ్చారు. అలాగే  సుకుమార్ గారి విజన్‌‌‌‌కి తగ్గట్టుగానే చాయ్ గ్లాస్ స్టెప్, ఫోన్ స్టెప్, ఫైర్ సిగరెట్ స్టెప్.. ఇవన్నీ పుష్ప క్యారెక్టరైజేషన్ నుంచే కంపోజ్ చేయడం జరిగింది. జాతర పాట నా కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే మైల్ స్టోన్‌‌‌‌గా నిలిచిపోతుంది. ఈ సక్సెస్‌‌‌‌తో నాపై ఇంకా బాధ్యత పెరిగింది. ఏ సాంగ్ వచ్చిన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, రామ్ గారి సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్  భైరవం, మ్యాడ్‌‌‌‌2కి సింగిల్ కార్డ్ చేస్తున్నా. హిందీలో బేబీ చేస్తున్నా’ అని చెప్పాడు.