ఎలక్షన్​ రూల్స్​ పక్కాగా అమలు చేయాలి: ఎల్ఎస్ చౌహాన్

ఎలక్షన్​ రూల్స్​ పక్కాగా అమలు చేయాలి: ఎల్ఎస్  చౌహాన్

నారాయణపేట, వెలుగు: ఎన్నికల కోడ్  అమలులోకి వచ్చిన దృష్ట్యా రూల్స్​ను పక్కాగా అమలు చేయాలని జోగులాంబ జోన్  డీఐజీ ఎల్ఎస్  చౌహాన్ ఆదేశించారు. ఎస్పీ ఆఫీస్​లో పోలీస్  ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. నారాయణపేట, కర్నాటక బార్డర్ లో చెక్ పోస్టులలో తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కర్నాటక నుంచి అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు రాకుండా చూడాలని సూచించారు. 

బార్డర్ చెక్​పోస్టులలో 24 గంటలు తనిఖీలు చేయాలని, ఎన్నికల రూల్స్​ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. బెల్ట్ షాప్ లపై దాడులు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్  మీడియాలో ఫేక్  మెసేజ్​లను ఫార్వర్డ్  చేసే వారిపై నిఘా ఉంచాలని సూచించారు. రౌడీలు, సస్పెక్ట్ లపై నిఘా ఏర్పాటు చేయాలని, వారి కదలికలపై దృష్టి పెట్టాలన్నారు. లైసెన్స్  ఆయుధాలు వెంటనే సరెండర్ చేసేలా చూడాలన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని అధికారులకు చెప్పారు. ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్  ఎస్పీ నాగేంద్రుడు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.