డిప్యుటేషన్​పై వెళ్లిన టీచర్లను రప్పించండి

డిప్యుటేషన్​పై వెళ్లిన టీచర్లను రప్పించండి

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్​లో పనిచేస్తూ హైదరాబాద్​కు డిప్యుటేషన్​పై వెళ్లిన.. తెలుగు, ఇంగ్లీషు టీచర్లను తిరిగి పాఠశాలకు రప్పించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం ఆందోళన చేపట్టారు. టీచర్ల అక్రమ డిప్యుటేషన్​ను వెంటనే రద్దు చేయాలని రోడ్డుపై బైఠాయించారు. టీచర్లు తమకు ఇష్టమొచ్చినట్టుగా డిప్యుటేషన్​​పై వెళ్తే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు.