దిగ్గజ క్రికెటర్లను చూసేందుకు అభిమానులకు చక్కటి అవకాశం. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో మాజీ స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 16 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీ కోసం వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. అతనితో పాటు మఖాయా ఎంతిని, మాంటీ పనేసర్ ఆడడం కన్ఫర్మ్ అయింది. గేల్ రావడంతో టోర్నీకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. టీ20క్రికెట్ లో లెక్కలేనన్ని రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ విండీస్ వీరుడు.. వెస్టిండీస్ మాస్టర్స్‌కు మెరుపులు మెరిపించాడానికి రెడీ అయ్యాడు.
"ఈ టోర్నీ మరోసారి ఆడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. గ్రౌండ్ లో మీరు నా ఎనర్జీని చూస్తారు". అని గేల్ అన్నాడు. టోర్నీ నవీ ముంబై, రాజ్‌కోట్, రాయ్‌పూర్‌లలో వేదికల్లో నిర్వహించబడుతుంది. భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ ఇటీవలే ఈ టోర్నమెంట్‌లో ఆడుతున్నట్టు ధృవీకరించాడు. భారత్, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆడనున్నాయి. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో బరిలోకి దిగే ఇండియా టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ALSO READ | WPL 2025: ఆర్‌సీబీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్
బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గావస్కర్ లీగ్ కమిషనర్‌గా పని చేయనున్నారు. వెస్టిండీస్ జట్టుకు బ్రియాన్ లారా నేతృత్వం వహిస్తాడు. శ్రీలంక కెప్టెన్‌గా కుమార సంగక్కర, సౌతాఫ్రికా సారథిగా ఆల్‌రౌండర్ జాక్వస్ కలిస్ వ్యవహరించనున్నారు. ఇయాన్ మోర్గాన్, షేన్ వాట్సన్ వరుసగా ఇంగ్లండ్, ఆసీస్ జట్లను నడిపించనున్నారు.
Gayle-storm is loading at #IMLT20! 🌪️ Stay tuned for some 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐞 𝐁𝐨𝐬𝐬 power! 🤩
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) February 3, 2025
Master Chris Gayle has arrived, and you already know what’s coming! Sixes, Entertainment & a whole lot of firepower! 🔥✨#BaapsOfCricket pic.twitter.com/FkX0fXNqm6