Chris Gayle: రోహిత్‎ను పక్కన పెట్టిన గేల్..యూనివర్సల్ బాస్ ఆల్‌టైం ఐపీఎల్ జట్టు ఇదే!

Chris Gayle: రోహిత్‎ను పక్కన పెట్టిన గేల్..యూనివర్సల్ బాస్ ఆల్‌టైం ఐపీఎల్ జట్టు ఇదే!

ఐపీఎల్ లో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ కు ఘనమైన చరిత్ర ఉంది. రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకువడంతో పాటు.. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా నిలిచాడు. ముఖ్యంగా ఐపీఎల్ లో ఈ విండీస్ వీరుడు చేసిన 175 పరుగుల అత్యధిక స్కోర్ రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఓపెనర్ గా ఐపీఎల్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న గేల్.. ఆల్ టైం బెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. తాజాగా ఇన్సైడ్ స్పోర్ట్స్ తో మాట్లాడిన గేల్ తన ఆల్ టైం ఐపీఎల్ జట్టును ప్రకటించాడు. 

11 మందితో కూడిన జట్టులో గేల్ జట్టు చాలా భిన్నంగా కనిపిస్తుంది. తన ఆల్ టైం ప్లేయింగ్ 11లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు స్థానం ఇవ్వలేదు. మలింగతో పాటు డేవిడ్ వార్నర్ లకు సైతం చోటు దక్కలేదు. ఓపెనర్లుగా తనతో పాటు విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. మూడో స్థానంలో ఐపీఎల్ స్పెషలిస్ట్ సురేష్ రైనాను ఎంచుకున్నాడు. ప్రపంచంలో విధ్వంసకర వీరుడు డివిలియర్స్ ని  నాలుగో స్థానానికి ఎంపిక చేశాడు.

ALSO READ : సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. స్టోయినిస్, టిమ్ డేవిడ్‌లకు షాక్!

కెప్టెన్, వికెట్ కీపర్ గా మహేంద్ర సింగ్ దీనికి ఛాన్స్ ఇచ్చాడు. ధోనీ తర్వాత ముగ్గురు ఆల్ రౌండర్లను గేల్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్లు సునీల్ నరైన్, డ్వెన్ బ్రావోతో పాటు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్లుగా ఇద్దరు ఇండియన్ స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లను ఎంపిక చేశాడు. ఏకైక స్పిన్నర్ గా చాహల్ చోటు సంపాదించాడు. 

క్రిస్ గేల్ ఆల్ టైం ఐపీఎల్ ప్లేయింగ్ 11: 

క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, AB డివిలియర్స్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్), డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్