ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ కెరీర్ లో అరుదైన ఘనతను అందుకున్నాడు. వెస్టిండీస్ పై జరుగుతున్న రెండో టెస్టులో జాసన్ హోల్డర్ వికెట్ ను పడగొట్టడం ద్వారా తన క్రికెట్ కెరీర్ లో 1000 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 557 వికెట్లు పడగొట్టాడు . లిస్ట్ ఏ క్రికెట్ లో 251 వికెట్లతో పాటు.. టీ20ల్లో 172 వికెట్లను కూల్చాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే టెస్టుల్లో 154.. వన్డేల్లో 173.. టీ20 ల్లో 32 వికెట్లు తీసుకున్నాడు.
వోక్స్ ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. ఈ సిరీస్ లో మొదటి టెస్టులో ఒక వికెట్ తీసుకున్న ఈ ఇంగ్లీష్ బౌలర్ నాటింగ్ హోమ్ లో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ తరపున 2011 నుంచి వోక్స్ ఇంగ్లాండ్ తరపున ఆడుతున్నాడు. 13 ఏళ్ళగా వోక్స్ అలుపెరుగని క్రికెట్ ఆడుతున్నాడు. జాతీయ జట్టులో స్థానం దక్కపోయినా డొమెస్టిక్ క్రికెట్ లో ఆడుతూ బిజీగా ఉన్నాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ సెంచరీ (121)తో పాటు డకెట్(73) హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ 457 పరుగులు చేసింది. కవెమ్ హాడ్జ్ (121) సెంచరీకి తోడు.. అతనాజ్ (82), డిసిల్వా (82) హాఫ్ సెంచరీలు చేశారు. ఆడుతుంది ఇంగ్లాండ్ గడ్డపైనే అయినా వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 41 పరుగుల ఆధిక్యం సంపాదించడం విశేషం.
Chris Woakes completes 1,000 career wickets. 🤯🔥 pic.twitter.com/uNfst0gPHX
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2024