Cricket World Cup 2023: టైమ్డ్-అవుట్ నుంచి తప్పించుకున్న ఇంగ్లాండ్ ఆటగాడు.. ఏం చేసాడంటే..?

Cricket World Cup 2023: టైమ్డ్-అవుట్ నుంచి తప్పించుకున్న ఇంగ్లాండ్ ఆటగాడు.. ఏం చేసాడంటే..?

వరల్డ్ కప్ లో  టైమ్డ్-అవుట్ విధానంతో శ్రీలంక సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ పెవిలియన్ కు చేరడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం తొలి బంతిని ఎదర్కోవడానికి బ్యాటర్ కు రెండు నిమిషాల సమయాన్ని ఇస్తారు.  అయితే మాథ్యూస్ హెల్మెట్ సరిగా లేని కారణంగా బ్యాటింగ్ చేసేందుకు ఈ రెండు నిమిషాల సమయం మించిపోయింది. దీంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ అప్పీల్ చేయడంతో అంపైర్ అవుట్ గా ప్రకటించారు. 

also read :Cricket World Cup 2023: అన్నింటా కుట్ర.. ఐసీసీ ర్యాంకులు కాదు.. బీసీసీఐ ర్యాంకులు: పాక్ టీమ్ డైరెక్టర్

క్రికెట్ చరిత్రలో మాథ్యూస్ బంతిని ఆడకుండానే టైమ్డ్-అవుట్ కారణంగా ఔటైన తొలి బ్యాటర్ గా నిలిచాడు. ఈ అవుట్ పై పెద్ద దుమారమే జరిగింది. ఇదిలా ఉండగా ఇలాంటి సంఘటనే ఇంగ్లాండ్ ఆటగాడు క్రిష్ వోక్స్ కు ఎదురైంది. నిన్న (నవంబర్ 8) న ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వోక్స్ కూడా హెల్మెట్ సమస్యలను ఎదుర్కున్నాడు. అయితే అంతలోనే అప్రమత్తమై ఈ విషయాన్ని అంపైర్ తో పాటు నెదర్లాండ్స్ బౌలర్ కు చెప్పాడు. దీంతో లేట్ అయినా తన పరిస్థితి గురించి అంపైర్ కు వివరించడంతో బతికిపోయాడు. 

ఇంగ్లాండ్ జట్టు 191 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయినప్పడు 36 వ ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ రెండు మ్యాచ్ లకు అంపైర్ ఎరాస్మస్ కావడం గమనార్హం. ఇక ఈ  మ్యాచ్ లో ఇంగ్లాండ్ 160 పరుగుల భారీ తేడాతో గెలిచింది. వరుసగా 5 ఓటముల తర్వాత ఇంగ్లాండ్ ఈ విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.