
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. ఉదయం 11.30 గంటలకు శిలువను ఊరే గించిన అనంతరం మధ్యా హ్నం 2 గంటల వరకు ప్రార్థనలు జరిగాయి. ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు గురువుల ఆశీర్వాదాలు పొందారు. శుభ శుక్రవారం ఏసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు. శిలువకు తనకు తానే లోక పాపములను పోగొట్టుటకు శిలువ ఎక్కాడు.
ఆ దినము న పలికిన 7 ప్రవచనాలను భక్తులు ధ్యానం చేయడం ఈ రోజు ప్రత్యేకత. చర్చి ప్రేసీబేటరీ ఇన్‌చార్జి రెవరెండ్ శాంత య్య దైవ సందేశం చేశారు.ఏసు శిలువ వేయబడిన తర్వాత తన చివరి ఏడు మాటల గురించి భక్తులకు వివరించారు. ఈ సందర్భం గా ఏసయ్య భక్తి గీతాలు ఆలపించారు.గుడ్ ఫ్రైడే సందర్భంగా మెదక్ డయాసిస్ పరిధి లోని పలు జిల్లాల నుంచి క్రైస్తవులు భారీగా తరలి రావడంతో చర్చి ప్రాంతం కిటకిటలా డింది..