
తిరుమలలో శిలువ గుర్తు కలకలం రేపుతోంది. టీ కప్పులపై T అనే అక్షరాన్ని శిలువ గుర్తులా ముద్రించిన వైనం వెలుగులోకి వచ్చింది. భక్తుల నుంచి సమాచారం అందుకున్న టీటీడీ ఆరోగ్యశాఖ అధికారుల టీ దుఖానాలపై తనిఖీలు చేపట్టారు. టెలిఫోన్ ఆఫీస్ దగ్గర ఓ షాపును సీజ్ చేశారు. ఆ షాపులో నుంచి టీ కప్పులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తిరుమలలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.