పొరపాట్లు లేకుండా ఓటర్ల జాబితా : క్రిస్టినా జెడ్​చోంగ్తూ

కామారెడ్డి, వెలుగు: పొరపాట్లకు తాడు లేకుండా, పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించాలని  రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, జిల్లా అబ్జర్వర్​క్రిస్టినా జెడ్​చోంగ్తూ పేర్కొన్నారు. మంగళవారం ఆమె కలెక్టర్​జితేశ్​వీ పాటిల్, అడిషనల్ కలెక్టర్​మనుచౌదరితో కలిసి పెద్దకొడప్​గల్​ మండలం జగన్నాథ్​పల్లి, ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్​లలో పోలింగ్​సెంటర్లలో ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు.

 ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 19 వరకు స్వీకరించిన అప్లికేషన్లను 27 వరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలన్నారు. జాబితా రూపకల్పనలో జాగ్రత్తలు కోవాలన్నారు.ఆర్డీవో భుజంగం, తహసీల్దార్లు పాల్గొన్నారు.