సందడిగా ​కేక్​ మిక్సింగ్

లక్డీకాపూల్​లోని అశోక హోటల్​లో సోమవారం క్రిస్మస్​ కేక్ మిక్సింగ్ ఫెస్ట్ సందడిగా సాగింది. వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, కాస్ట్లీ వైన్, దేశీ లిక్కర్​తో కేక్ తయారీకి అవసరమైన మిశ్రమాన్ని తయారు చేశారు. డిసెంబర్ రెండో వారం వరకు సోక్ చేసి చివరగా కేక్ తయారీని ప్రారంభిస్తామని హోటల్ ఈడీ డాక్టర్ తేజస్వినిరెడ్డి , వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ జావేద్ తెలిపారు. – వెలుగు, బషీర్ బాగ్