కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు 

ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా బుధవారం క్రిస్‌‌‌‌‌‌‌‌మస్‌‌‌‌‌‌‌‌ వేడుకలను క్రిస్టియన్లు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రేమ సహనం శాంతికి నిర్వచనం క్రీస్తు ప్రభువు అని, ఆయన చూపించిన మార్గంలో నడవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు పేర్కొన్నారు. మంథనిలోని శ్రీపాద కాలనీ గల సీయోను చర్చిలో వేడుకలకు మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సీఎస్ఐ వెస్లీ కేథడ్రల్ చర్చిలో నిర్వహించిన వేడుకులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. వేములవాడలో విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. బోయినిపల్లి మండలకేంద్రంలో జరిగిన వేడుకల్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.  ద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లోని పలు చర్చిల్లో ఎమ్మెల్యే విజయరమణారావు కేక్‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌ చేసి పంపిణీ చేశారు.