రెండేళ్ల గరిష్టానికి సరుకుల ఎగుమతులు

రెండేళ్ల గరిష్టానికి సరుకుల ఎగుమతులు

న్యూఢిల్లీ: కిందటి నెలలో దేశ గూడ్స్ (మర్చండైజ్‌) ఎగుమతులు 39.2 బిలియన్ డాలర్లకు  పెరిగాయి. గత రెండేళ్లలో ఇదే అత్యధికం.  కిందటేడాది అక్టోబర్‌‌లో జరిపిన గూడ్స్‌ ఎగుమతులతో పోలిస్తే 17.25 శాతం గ్రోత్ నమోదైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌‌లో రికార్డ్‌ అయిన 34.58 బిలియన్ డాలర్లతో పోలిస్తే 0.5 శాతం పెరిగింది.    ట్రేడ్ డెఫిసిట్ (దిగుమతులు, ఎగుమతుల మధ్య తేడా)  27.14 బిలియన్ డాలర్లుగా రికార్డ్‌ అయ్యింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌‌లో నమోదైన 20.78 బిలియన్ డాలర్లతో పోలిస్తే ట్రేడ్ డెఫిసిట్ అక్టోబర్‌‌లో పెరిగింది. కానీ, కిందటేడాది అక్టోబర్‌‌లో నమోదైన 30.42 బిలియన్ డాలర్లతో పోలిస్తే తగ్గింది.  ప్రభుత్వ డేటా ప్రకారం, కిందటి నెలలో 66.34 బిలియన్ డాలర్ల విలువైన గూడ్స్​ను దిగుమతి చేసుకున్నాం. ఇది ఏడాది ప్రాతిపదికన 3.9 శాతం ఎక్కువ. ఈ ఏడాది ఏప్రిల్‌–అక్టోబర్ మధ్య ఇండియా గూడ్స్ ఎగుమతులు 252.28 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 416.93 బిలియన్ డాలర్లకు ఎగిశాయి.