ప్రస్తుతమున్న ఫాస్ట్.. ఫాస్టెస్ట్ జనరేషన్ లో ఆన్ లైన్ పై ఆధారపడడం సర్వసాధారణమైపోయింది. భోజనం చేయాలన్నా, ఎక్కడికైనా బయటికి వెళ్లాలన్నా, ఏదైనా వస్తువు కొనాలన్నా అన్నీ ఆన్ లైన్.. ఆన్ లైన్.. ఆన్ లైన్.. కానీ ఈ ఆన్ లైన్ అనేది కొన్ని సార్లు భారీ నష్టాలను ఎదుర్కునేలా చేస్తుంది. మరికొన్ని సార్లు అనారోగ్యం పాలయ్యేలా కూడా చేస్తుంది. ఇటీవల ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల తన ఫుడ్ ఆర్డర్ అందుకుని భారీ షాక్‌కు గురయ్యాడు. అప్పటికే ఆకలితో ఉన్న ఆ వ్యక్తి ఫుడ్ వస్తే లాగించేద్దామని రెడీ అవుతుండగా.. అతనికి ఓ బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఎదురైంది. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఆర్డర్ చేసిన ఉజ్వల్ పూరీ అనే వ్యక్తి భోజనంలో ట్యాబ్లెట్ రావడంతో షాక్ తిన్నాడు.
My Mumbai Christmas Surprise ordered food from Swiggy from Leopold Colaba got this half cooked medicine in my food @Swiggy pic.twitter.com/ZKU30LzDhi
— Ujwal Puri // ompsyram.eth ? (@ompsyram) December 24, 2023
వృత్తి రీత్యా ఫోటోగ్రాఫర్ అయిన పూరీ పరిస్థితిని వివరించేందుకు ఎక్స్‌లో ఒక చిత్రాన్ని, వీడియోను పంచుకున్నాడు. ఆ వ్యక్తి కోలాబాలోని లియోపోల్డ్ కేఫ్ నుండి ఆయిస్టర్ సాస్‌లో చికెన్ ఆర్డర్ చేశాడు. లియోపోల్డ్ కేఫ్ నగరంలోని పురాతన ఇరానియన్ కేఫ్‌లలో ఇది ఒకటి. దీన్ని స్థానికులు, పర్యాటకులు సైతం తరచుగా సందర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా, 2008లో ముంబై ఉగ్రదాడి సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న నివాసాలలో ఈ కేఫ్ ఒకటి. అయితే ఈ పోస్ట్ ను 'క్రిస్మస్ సర్‌ప్రైజ్'గా పేర్కొంటూ, పూరీ Xలో.. తన ముంబై క్రిస్మస్ సర్‌ప్రైజ్ అని ప్రారంభిస్తూ.. లియోపోల్డ్ కొలాబా స్విగ్గి నుండి ఆహారాన్ని ఆర్డర్ చేసిందని, అందులో ట్యాబ్లెట్ వచ్చిందని రాసుకొచ్చాడు.
ఉజ్వల్ పూరీ తన ఆహారంలో మెడిసిన్ ను చూపించే ఓ సంక్షిప్త వీడియోను కూడా పోస్ట్ చేశాడు. లియోపోల్డ్ (ఓస్టెర్ సాస్‌లో చికెన్) లో ఇది దొరికిందని అతను క్యాప్షన్‌లో రాశాడు. ఉజ్వల్ పూరి తన ఆహారంలో ఔషధాన్ని చూపించే సంక్షిప్త వీడియోను కూడా పోస్ట్ చేశాడు. పూరీ పోస్ట్ పై స్పందించిన స్విగ్గీ.. మీ కంప్లైంట్ తమకు అందింది.. మళ్లీ కలుద్దాం అంటూ రిప్లై ఇచ్చింది. ఇక సంఘటనపై ఇంటర్నెట్ యూజర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ సిబ్బందిపై మండిపడ్డారు. స్విగ్గీ, ఏంటి ఇది.. మీరు సగం ఉడికిన మెడిసిన్ పంపారు. కనీసం, రెస్టారెంట్‌ని సరిగ్గా ఉడికించమని అడగండని కొందరు చురకలంటించారు.
My Mumbai Christmas Surprise ordered food from Swiggy from Leopold Colaba got this half cooked medicine in my food @Swiggy pic.twitter.com/ZKU30LzDhi
— Ujwal Puri // ompsyram.eth ? (@ompsyram) December 24, 2023