కాంగ్రెస్ యుద్ధం బీఆర్​ఎస్​తోనే: క్రిస్టోఫర్ తిలక్

వేములవాడ, వెలుగు :    కాంగ్రెస్​    యుద్ధం  బీఆర్​ఎస్​ పార్టీతోనే అని, వచ్చే 44 రోజుల్లో బీఆర్​ఎస్​  కొత్త  డ్రామాలకు తేరలేపుతుందని, కాంగ్రెస్​ కార్యకర్తలు అలెర్ట్​గా ఉండాలని ఏఐసీసీ సెక్రటరీ క్రిస్టోఫర్ తిలక్ అన్నారు. ఆదివారం  పట్టణంలోని  హారిమల గార్డెన్ లో వేములవాడ అర్బన్, రూరల్ మండల కాంగ్రెస్  కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  వేములవాడ ప్రాంతం అభివృద్ధి లో చాల వెనకబడిందన్నారు.

బీఆర్​ఎస్​ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, కాంగ్రెస్​ హామీలు గడపగడపకూ చేరవేయాలని పిలుపునిచ్చారు.  సీఎం  కేసీఆర్ పైకి గొప్పగా  మాట్లాడినా.. లోపల అంతా కుట్రలే ఉంటాయని చెప్పారు.     కాంగ్రెస్​ను బూత్​ స్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్  అధ్యక్షుడు ఆది శ్రీనివాస్,  పట్టణ, అర్బన్, రూరల్​ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పిళ్లి కనకయ్య, వకులాభరణం శ్రీనివాస్, నాయకులు తదితరులు ఉన్నారు.