ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ యాత్ర. మహి వి రాఘవ్ తెరెకక్కించిన ఈ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్ గా యాత్ర 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైఎస్ మరణాంతరం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వై ఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.
తాజాగా ఈ సినిమా నుండి చూడు నాన్న.. నీడ లేని నేనా వీళ్ళ ధీమా అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. చాలా ఎమోషనల్ గా సాగిన ఈ పాట జనాల హృదయాలను తాకుతోంది. ఈ పాటలో చూపించిన విజువల్స్ కూడా చాలా హృద్యంగా ఉన్నాయి. జగన్ ఓదార్పు యాత్ర సాగిన తీరు, ఆయన జనాలతో కలిసి వాళ్ళని ఓదార్చిన తీరు చాలా సహజంగా తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్. ఇంటికి పెద్ద చనిపోతే.. ఆ ఇల్లు అనాధ అవుతుంది. అవుతుంది అంటూ సాగిన లైన్స్ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
ఇక జగన్ పాత్రలో జీవా నటించాడు అనే కంటే జీవించాడు అనే చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ ను ఆద్భుతంగా చేశాడు జీవా. ఒక పాటలోనే ఈ రేంజ్ లో ఉందంటే.. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఎన్ని ఉంటాయో అనుకుంటున్నారు ఆడియన్స్. ఆ ఎమోషనల్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. చూస్తుంటే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించేలా కనిపిస్తుంది.