Ananya Pandey: ఆ సినిమా చేయకూడదు అనుకుంటూనే చేసింది : అనన్య ఫీలింగ్స్

Ananya Pandey: ఆ సినిమా చేయకూడదు అనుకుంటూనే చేసింది : అనన్య ఫీలింగ్స్

విజయ్ దేవరకొండ లైగర్ (Liger) మూవీ ఎలాంటి అంచనాలను తలక్రిందులు చేసిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ డిజాస్టర్ అయినదానికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో నెటిజన్లకు ట్రోల్ మెటీరియల్‌గా మారింది. అయితే, ఇపుడు లైగర్ లీజైన మూడు సంవత్సరాల తర్వాత మరోసారి చర్చకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..  

ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey) టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో గ్లామర్‌ డోస్‌ పెంచినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో అనన్యకు ఇదే తెలుగు చివరి మూవీగా నిలిచింది.

అయితే, లేటెస్ట్గా అనన్య పాండే తండ్రి నటుడు చుంకీ పాండే ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన డాటర్ అనన్య పాండే ముందుగానే సినిమాలో నటించడానికి 'అసౌకర్యంగా' ఫీల్ అయిందని తెలిపాడు. 

ALSO READ | 2 సార్లు విడాకుల తర్వాత 59 ఏళ్ళ వయసులో మళ్ళీ ప్రేమలో పడ్డ స్టార్ హీరో..

చుంకీ పాండే (Chunky Pandey) మాటల్లోనే.. లైగర్ మూవీలో అనన్యకు ఛాన్స్ వచ్చినప్పుడు తను ఎంతో అసౌకర్యంగా ఫీలైంది. ఒకరకంగా తెలియని గందరగోళానికి గురైంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు ఏ మాత్రం సెట్‌ కానని, చిన్న పిల్లలా కనిపిస్తానని తను అనుకుంది. దాంతో నా వద్దకు వచ్చింది. "నాన్నా.. ఈ సినిమాకు నేను సెట్‌ కాననిపిస్తుంది. ఏం చేయమంటావు?"అని అడిగిందని చెప్పాడు. 

ఆ తర్వాత అనన్యకు నచ్చచెప్పి తానే సినిమాలో నటించేందుకు ఒప్పించినట్లు తెలిపాడు."అలా ఏమీ కాదని.. అదొక బిగ్‌ ప్రాజెక్ట్‌ కనుక సక్సెస్‌ అయితే పేరు వస్తుందని చెప్పి ఆమెను ఒప్పించాను. అయితే, మూవీ రిలీజ్ అయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసి.. తన డాటర్  చెప్పింది నిజమేననిపించిందని' చుంకీ పాండే తెలిపాడు.

అయితే, ఈ సినిమాలో నిజంగానే ఆ రోల్ కు అనన్య చాలా యంగ్‌గా అనిపించిందని.. ఆ సినిమా తర్వాత నుండి ఇక తనకు ఎప్పుడూ సలహాలు ఇవ్వలేదని చుంకీ పాండే వెల్లడించాడు. దాంతో ప్రస్తుతం లైగర్ సినిమా ప్రస్తావన మరోసారి చర్చకు వచ్చింది. లైగర్‌ సినిమా చేయడానికి నిర్మాత కరణ్‌జోహార్‌తో పాటు తన తల్లిదండ్రులు వీరిద్దరే కారణమని ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.