ముషీరాబాద్‌లో రచ్చకెక్కిన హెబ్రోన్ చర్చి పంచాదీ

ముషీరాబాద్‌లో రచ్చకెక్కిన హెబ్రోన్ చర్చి పంచాదీ

ముషీరాబాద్/ఖైరతాబాద్, వెలుగు: ముషీరాబాద్ గోల్కొండ చౌరస్తాలోని హెబ్రోన్ చర్చి పంచాదీ రచ్చకెక్కింది. స్వార్ధ ప్రయోజనాల కోసం చర్చికి సంబంధం లేని వ్యక్తులు ప్రార్థనా మందిరాన్ని అపవిత్రం చేస్తున్నారని చర్చి సొసైటీ సభ్యుడు వీరాచారి ఆరోపించారు. చర్చి ప్రాంగణంలో సొసైటీ, ట్రస్ట్ సభ్యులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. చర్చిలో సొసైటీ, ట్రస్ట్ సభ్యులకు ఎటువంటి గొడవలు లేవని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపివేయాలని కోరారు. చర్చికి ఎటువంటి సంబంధం లేని మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తన పలుకుబడితో సొసైటీ, ట్రస్ట్ వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 

ప్రభుత్వం న్యాయం చేయాలి

మరోవైపు కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా చర్చిలోకి ప్రవేశించడమే కాకుండా మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర రావుపై దాడి చేశారని మాజీ డీజీపీ బాబూరావు, రూబెన్ ఫ్రాన్సిస్, జాన్​ స్టావర్డ్​ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో వారు మాట్లాడారు. ఈ నెల 23న వీరాచారి తన అనుచరులతో చర్చి వద్దకు తాళం వేశారని ఆరోపించారు. 1951 నుంచి ఈ చర్చి ఉందని, దీనికి అనుబంధంగా 10 వేల చర్చిలు ఉన్నాయన్నారు. ఈ చర్చి​ తమ సొసైటీదంటూ  ఇబ్బందులు  గురిచేస్తున్నాడన్నారు. సుమారు రూ.4 వందల కోట్ల ప్రాపర్టీని ఎలాగైనా కాజేసేందుకు కుయుక్తులు పన్నుతున్నట్టు ఆరోపించారు.   ప్రభుత్వం దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. ఈ ఘటనపై చిక్కడ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదన్నారు.