- నోటీసులు జారీ చేసిన రైల్వే అధికారులు
సికింద్రాబాద్, వెలుగు: రైల్వే స్థలాల్లోని చర్చీలను, ఇతర మత పరమైన సంస్థలను ఖాళీ చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. డిసెంబరు 12లోగా ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లాలాగూడలోని సీఎస్ఐ, సెక్రెడ్ హార్ట్స్ చర్చీలకు నోటీసులు అందాయి. అయితే ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమనడం కరెక్ట్కాదని నిర్వాహకులు అంటున్నారు. 90 ఏండ్లుగా అగ్రిమెంట్ప్రకారం రెంట్కడుతున్నామని చెబుతున్నారు. మరోమారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ఐ చర్చి సెక్రటరీ విక్టర్ కోరారు.