గూడూరు, వెలుగు: రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏబీ పంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని గూడూరు సీఐ బాబూరావు, ఎస్సై గిరిధర్ రెడ్డి సూచించారు. ఆదివారం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు.
దాంట్లో భాగంగా మహబూబాబాద్ ఎస్పీ రాంనాథ్ఆధ్వర్యంలో ఈనెల 8న 40 కంపెనీలతో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం రెండు వేల మంది నిరుద్యోగులకు ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. అర్హులందరూ సర్టిఫికెట్లను తీసుకుని ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.