గుండాల, వెలుగు: మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గుండాల సీఐ కరుణాకర్ వలస గొత్తి కోయలను హెచ్చరించారు. మంగళవారం ఆళ్లపల్లి మండలంలోని మారుమూల ప్రాంతమైన అడవిరామారంను ఆయన సిబ్బందితో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా వలస గొత్తి కోయలతో మాట్లాడారు. కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామానికి వస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు తప్పవన్నారు. స్థానికంగా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించొచ్చని, పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. సీఐ వెంట ఆళ్లపల్లి ఎస్సై రతీశ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.